![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -303 లో.... సీతాకాంత్, రామలక్ష్మి ల దగ్గరికి సన్నీ వస్తుంది. మీరు చేసిన ప్రోగ్రామ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చేద్దామని అంటుంది. దాంతో రెడీ అయి వస్తామని సీతాకాంత్ అంటాడు కానీ ఈ లైవ్ ప్రోగ్రాం రోజులో ఒక అరగంట మాత్రమే ఉంటుందని చెప్పు సన్నీ అని రామలక్ష్మి చెప్పగానే.. ఎందుకలా అని సీతాకాంత్ అడుగుతాడు. రోజు అంత ఇలా లైవ్ చేస్తూ వాళ్ళకి సమాధానం చెప్తుంటే వాల్యూ ఉండదు.. పైగా టైమ్ పాస్ కి కూడా కాల్ చేస్తుంటారని రామలక్ష్మి అంటుంది.
దాంతో సరేనని సన్నీ అంటుంది. రామలక్ష్మి నీకు ఎంత తెలివి ఉందని సీతాకాంత్ పొగుడుతాడు. ఆ తర్వాత సీతాకాంత్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఫేమస్ అవుతాడు. దాంతో ఒకతను ఫోన్ చేసి మీరు మంచి సలహాలు ఇస్తున్నారు. మీరు మా ఆఫీస్ కి రండీ అని అడుగుగా సీతాకాంత్ సరే అంటాడు. అదే విషయం రామలక్ష్మికి చెప్పగా తను చాలా హ్యాపీగా ఫీల్ అయి ఆఫీస్ కి మీరు ఇలా వెళ్తారా మంచి షర్ట్ ఉందేమో చూస్తానని ఒక షర్ట్ తీసుకొని వచ్చి చెంబుతో ఐరన్ చేసి ఇస్తుంది. సీతాకాంత్ ని ఆఫీస్ కి రెడీ చేసి పంపిస్తుంది. తనే స్వయంగా అటోలో ఆఫీస్ వరకు దింపి అల్ ది బెస్ట్ చెప్తుంది.
మరొకవైపు సీతాకాంత్ కోసం మురళి అనే వ్యక్తి సందీప్, భద్రమ్ ధన వాళ్ళతో కలిసి వెయిట్ చేస్తుంటాడు. సీతాకాంత్ రావడం చూసి ధన వాళ్లు షాక్ అవుతారు. మీరు అన్న వ్యక్తి అతనేనా అని మురళితో భద్రం అంటాడు. ఆ తర్వాత ఒరేయ్ భద్రం నీకు డబ్బు ఎలా వచ్చిందో తెలుసురా.. మర్యాదగా డబ్బు అందరికి తిరిగి ఇచ్చేయ్ అని సీతాకాంత్ అంటాడు. సీతాకాంత్ నా ముందే నా మనిషిని తిడుతావా వెళ్ళమని సీతాకాంత్ ని పంపిస్తాడు మురళి. మరొకవైపు శ్రీవల్లి పాష్ గా రెడీ అవుతుంది. దాంతో శ్రీలత ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |